UA-35385725-1 UA-35385725-1

రెండు భాగాలుగా ‘విడుతలై’

రెండు భాగాలుగా ‘విడుతలై’

విజయ్ సేతుపతి, సూరి – వెట్రిమారన్ కాంబినేషన్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న “విడుతలై”!!

నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వాతియర్ గా, సూరి హీరోగా తెరకెక్కనున్న చిత్రం “విడుతలై”. ఆర్.ఏస్ ఇన్ఫో్టైన్మెంట్ మరియు రెడ్ జియంట్ మూవీస్ పతాకం పై ఎల్డ్రడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.

మొదలు పెట్టినప్పటి నుండి అనూహ్యమైన స్పందన ని అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కడం దీనిని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జియంట్ మూవీస్ పతాకం పై సమర్పించడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, “అద్భుతమైన నటీనటులు సాంకేతిక బృందం తో విడుతలై మొదటి భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రెండో భాగంలోని కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలున్నాయి. ఖర్చు కి వెనకాడకుండా నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ పరిశ్రమలో ఇప్పటివరకు తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. కళా దర్శకుడు జాకి నేతృత్వంలోని కళా బృందం 10 కోట్ల విలువ చేసే రైలు, రైలు బ్రిడ్జి సెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శించగా ఇటీవల సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి నేపథ్యం లో భారీ సెట్ ని నిర్మించారు. ప్రస్తుతం యాక్షన్ కోరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కోడైకనాల్  లో ఉత్కంఠభరితమైన సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బల్గేరియా నుండి తమిళనాడు కి వచ్చిన నిష్ణాతులైన స్టంట్ బృందం పాల్గొనున్నారు.”

విజయ్ సేతుపతి, సూరి తో పాటు భవాని శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ మరియు ఇతర అగ్ర తారలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

సంగీతం మేస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా గారు ఇస్తుండగా సినిమాటోగ్రఫీ వెల్ రాజ్ చూస్కుంటున్నారు.

భారీ అంచనాల మధ్య తెలుగు – తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కుతున్న ‘విడుతలై పార్ట్ 1’ & ‘విడుతలై పార్ట్ 2’ విడుదల తేదీని నిర్మాతలు అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. (Story: రెండు భాగాలుగా ‘విడుతలై’)

See Also: 

‘రారా రెడ్డి’ సాంగ్‌లో దుమ్మురేపిన అంజలి

మహేష్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది!

ఎఫ్‌ 3.. పక్కా ఫైసా వసూల్‌ మూవీ

‘మేజర్’ ఓహ్ ఇషా… వీడియో సాంగ్ విడుదల

ఆ నలుగురికీ రాజ్యసభ సీట్లు

మీకు పిల్లలున్నారా? అయితే ఈ సర్వే చూడండి!

లిపెడెమా ఓ వ్యాధి…అలసత్వం వద్దు!

దుమ్మురేపిన వ‌ర‌ల‌క్ష్మి! వీడియో

అలెర్ట్‌: బీపీ క్యాపిటల్‌గా హైదరాబాద్‌!)

నాకు మొగుడు కావాలి : ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శన

పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!

మసీదులో శివలింగం

అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!

తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న

ఆ నటిని భర్తే చంపేశాడు?

Mahesh-Trivikram’s movie to go on floors

Rashmika in hijab-clad

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Chaging Movie Trailer

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1