Home జీవనశైలి మీకు పిల్లలున్నారా? అయితే ఈ సర్వే చూడండి!

మీకు పిల్లలున్నారా? అయితే ఈ సర్వే చూడండి!

0
Children Watching TV
Children Watching TV

మీకు పిల్లలున్నారా? అయితే ఈ సర్వే చూడండి!

ముంబయి: భారతదేశంలో అగ్రగామి బాలల వినోదాత్మక ఛానల్‌ సోనీ యాయ్‌! మొట్టమొదటి సారిగా కాంటార్‌ రీసర్చ్‌ వారి సమన్వయ సహకారంతో నిర్వహించిన ‘భారతీయ బాలల జీవితాలు`అలవాట్లను డీకోడ్‌ చేసే సెర్చ్‌లైట్‌’ 22 పేరిట అత్యాధునిక సర్వేని విడుదల చేస్తోంది. ఈ సర్వేలో మానసిక శాస్త్ర సంబంధిత ప్రొఫైలింగ్‌, దేశంలోని ఎనిమిది నగరాలలో వివిధ పోకడలను ఎత్తి చూపుతుంది. ఈ పరిశోధన, విద్యావిషయకమైన, వ్యక్తిత్వ వికాసం మధ్యన, వినోద ప్రాధాన్యతల మధ్య కూడా తాను కనుగొన్న అంశాలను వెల్లడిరచింది. ఇది 7-14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న భారతీయ బాల వీక్షకుల హృదయాల్లోనికి లోతుగా తొంగిచూసి గ్రాహ్యతను అందజేస్తుంది. 57% మంది బాలలు టెలివిజన్‌కు ప్రాధాన్యమివ్వగా కేవలం 10% మంది మాత్రమే ఓటీటీ ద్వారా వినోదాన్ని అందుకుంటున్నారు. 33% మంది బాలలు టెలివిజన్‌, ఓటీటీ రెండింటికీ ప్రాధాన్యమిస్తున్నారని ఆ సర్వే పేర్కొంది.

  • 57% మంది బాలలు టెలివిజన్ కు ప్రాధాన్యమివ్వగా కేవలం 10% మంది మాత్రమే ఓటీటీ ద్వారా వినోదాన్ని అందుకుంటున్నారు
  • 33% మంది బాలలు టెలివిజన్ మరియు ఓటీటీ రెండింటికీ ప్రాధాన్యమిస్తున్నారు
  • చిన్న వయసు బాలలు టెలివిజన్ పట్ల ప్రాధాన్యమివ్వగా పెద్ద పిల్లలు ఓటీటీ వేదికల పట్ల ఎక్కువ ప్రాప్యతతో దానికి మొగ్గు చూపుతున్నారు
  • ఓటీటీ వినోదం పట్ల బాలల ప్రాధాన్యతలో ఒక స్పష్టమైన భౌగోళిక విభజన ఉంది, ఇందులో ఉత్తర భారతదేశములో సర్వే చేయబడిన బాలల్లో ఓటీటీ కి ప్రాధాన్యమిచ్చిన బాలలు 56% ఉండగా దక్షిణ భారతదేశములో సర్వే చేయబడిన బాలల్లో 81% మంది మాత్రమే ఓటీటీ పట్ల ప్రాధాన్యమిచ్చారు.

మహమ్మారి కాలములో బాలల ప్రయాణం బ్లాక్ బోర్డుల నుండి కీ బోర్డుల వైపుకు సాగిందనేది అందరికీ తెలిసిన విషయమే, అందువల్ల, వారి అభ్యసన ప్రాధాన్యతల్ని అర్థం చేసుకోవడానికి, సెర్చ్‌లైట్’22 కొన్ని గ్రాహ్యతలను విడమరచింది-

  • ఆన్‌లైన్ తరగతులను మళ్ళీ చూడదగిన ఆప్షన్ (29%), ఇంటి సౌకర్యత (28%), తదుపరి భౌతికంగా కానితీరులో తరగతులకు హాజరు కాగలిగిన సమర్థత (16%) మరియు సమయం ఆదా కావడం (15%) కారణంగా ఆఫ్‌లైన్ తరగతుల కంటే కూడా ఆన్‌లైన్ తరగతుల పట్ల బాలలు అనుకూలత చూపారు.
  • మహమ్మారి సందర్భంగా బాలలు పాల్గొన్న మొదటి 5 కార్యక్రమాలుగా, ట్యూషన్ తరగతులు (76%), ఆర్ట్ మరియు క్రాఫ్ట్ (24%), ఆ తర్వాత క్రీడలు (19%), నాట్యం (18%) మరియు పాటలు పాడటం (19%) ఉండినాయి.
  • రెస్పాండెంట్లలో అత్యధికులు తరగతులు ఆన్‌లైన్ జరగాలని కోరుకున్నారు (63%) కాగా మిగిలినవారు (37%) మహమ్మారికి ముందు నడచిన ఆఫ్‌లైన్ బోధనా శైలికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నట్లు తెలిపారు.
  • లాక్‌డౌన్ సందర్భంగా ప్రాముఖ్యతను ఎత్తుకున్న ఎడ్యుటెక్ వేదికలు కేవలం 6% మంది రెస్పాండెంట్ల నుండి మాత్రమే ఎడ్యుటెక్ చందాలను పొందినట్లుగా తెలిసింది కాగా 7% మంది రెస్పాండెంట్లు చందా చేసుకోలేదు కానీ ఎడ్యుటెక్ తరగతులకు హాజరయ్యారు.  అయినప్పటికీ, భావజాలములను నేర్చుకోవడానికి 39% మంది యూట్యూబ్ వీడియోలను ఎంచుకున్నారు, కాగా 48% మందికి ఎడ్యుటెక్ వేదికలు ఉన్నట్లుగా అవగాహన లేదు

 మహమ్మారి వల్ల కదలిక నిర్బంధాలు ఉన్న కారణంగా బాలలు ఇంటికే పరిమితమయ్యారు కాబట్టి, గేమింగ్ అనేది బాలల వినోదం యొక్క ఒక ఆవశ్యక భాగంగా తయారయింది.  ఈ సర్వే నుండి ఈ క్రింది గ్రాహ్యతలను వెలికి తీయడమైనది:

  • ప్రతి ఇద్దరు బాలల్లో ఒకరు తమ ఫోన్ పైన గేమింగ్ ఆనందించారు
  • వారి వినియోగానికి ఉచిత గేములే మూలముగా ఉండేవి
  • 53% మంది బాలలు ఒకరే ఆడుకోవటానికి ప్రాధాన్యమివ్వగా 44% మంది బహుళ ఆటగాళ్ళ గేముల్లో స్నేహితులతో కలిసి ఆడుకున్నారు మరియు 4% మంది మాత్రమే కొత్త వారితో బహుళ ఆటగాళ్ళ గేములు ఆడుకున్నారు

సెర్చ్‌లైట్’22 భారతీయ బాలల జీవితాలు మరియు అలవాట్లను డీకోడ్ చేయడంతో, బాలల క్రియాత్మకమైన మరియు ఉద్భవిస్తున్న ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి సోనీ YAY! ఒక అడుగు ముందుకు వేసింది.  ఈ అధ్యయనము, చదువు, వినోదం, గేమింగ్ మరియు వ్యాపార కార్యక్రమం యొక్క పలు విభాగాలు బాలలను ఎలా ప్రభావితం చేసి వారి అభిప్రాయాలు మరియు ప్రాధాన్యతలకు ఆకారమిస్తాయో ఒక సమగ్ర చిత్రణను కూడా అందిస్తుంది. ఈ ఫౌండేషన్ సంబంధిత అధ్యయనము బాలల గురించి మరింత బాగా తెలుసుకోవడానికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తుంది. (Story: మీకు పిల్లలున్నారా? అయితే ఈ సర్వే చూడండి!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version