Home అవీఇవీ! ఇంతకీ ఏమిటా రహస్య గది?

ఇంతకీ ఏమిటా రహస్య గది?

0
Secret Chamber
Secret Chamber

ఇంతకీ ఏమిటా రహస్య గది?

Secret Chamber: తమిళనాడులో ఓ సీక్రెట్‌ ఛాంబర్‌ కలకలం రేపింది. కోట్లాది రూపాయల దొంగతనం కేసు ఓ రహస్యగది గుట్టువిప్పింది. అనుకోకుండా జరిగిన ఈ ఉదంతం ఆసక్తిని రేపింది. ఓ పారిశ్రామిక వేత్త ఇంటికి సున్నం కొట్టేందుకు వెళ్లిన నలుగురు కార్మికులు దొంగతనానికి పాల్పడి ఏకంగా రూ. 2.5 కోట్ల నగదును అపహరించుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులు పట్టుబడినప్పటికీ, సీక్రెట్‌ ఛాంబర్‌ ఉదంతం మాత్రం అందరి కళ్లనూ తనవైపు తిప్పుకున్నది. తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన దురైస్వామి (56) ఓ బడా పారిశ్రామిక వేత్త. ఆయనకు నూలు ఉత్పత్తి మిల్లులు ఉన్నాయి. ఆయన కుమార్తెకు ఇటీవలనే పెళ్లయింది. ఇంట్లో భార్య ధనలక్ష్మితో పాటుగా వుంటున్న దురైస్వామికి సేవలు అందించేందుకు కొందరు పని వాళ్లు అవసరమయ్యారు. ఆ మేరకు కొందరు కార్మికులను వారు నియమించుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా తమ ఇంట్లో భారీ నగదు, నగలు మాయం కావడంతో దురైస్వామి చెన్నై పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేశారు. రెండు నెలల క్రితం దొరైస్వామి కుమార్తె వివాహం జరిగిన సమయంలో సున్నం కొట్టే వాళ్లపై వారికి అనుమానం కలిగింది. వారిలో తిరువణ్ణామలైకు చెందిన సతీష్‌, దామోదరన్‌, శక్తి, నీలగిరికి చెందిన రాధాకృష్ణన్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. కార్మికులుగా వున్న ఆ నలుగురూ ఉన్నట్టుండి విలాసజీవితం గడపడంతో పోలీసులకు సహజంగానే సందేహం తలెత్తింది. తీరా…విచారణలో తేలిందేమిటంటే, సున్నం కొట్టే సమయంలో దురైస్వామి ఇంట్లో తమకు ఒక రహస్య గది కనిపించిందని, అందులోకి వెళ్లి చూడగా, కొన్ని చిన్న చిన్న సంచుల్లో రూ. 2 వేల నోట్లను మూటలు కట్టి పడేసి ఉన్నాయని, అందులో ఓ సంచితో తాము ఉడాయించినట్టు వారు అంగీకరించారు. దీంతో ఈ నలుగుర్ని బుధవారం అరెస్టు చేశారు. వీరు పట్టుకెళ్లిన నగదు రూ. 2.5 కోట్లుగా తేల్చారు. ఆ నగదు ఎక్కడున్నదీ ఆరా తీస్తున్నారు. ఇక 75 లక్షలు విలువైన బంగారంతో తమకు సంబంధం లేదని ఆ నిందితులు చెప్పడంతో ఆ దొంగల గురించి పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. ఏదేమైనప్పటికీ, ఈ రహస్య గది రహస్యమేమిటో తేలిపోయింది. ఇంకో డబ్బు మూట కూడా అందులో వుంది. కాకపోతే ఆ పనివాళ్లు దాన్ని తీసుకువెళ్లలేదు. (Story: ఇంతకీ ఏమిటా రహస్య గది?)

See Also: 

విడదల రజనీ గ్రాండ్‌ పార్టీలో ఎవరామె?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

కేసీఆర్ ఫ్రంట్ పేరు బీఆర్ఎస్!

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version