UA-35385725-1 UA-35385725-1

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

Israel’s Iron Beam: అసలే యుద్ధం వద్దురో బాబోయ్‌ అని జనం మొత్తుకుంటుంటే, అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయిల్‌ మరో అద్భుతమైన సాంకేతిక యుద్ధ తంత్రాన్ని ఆవిష్కరించింది. కేవలం లేజర్‌ కిరణాలతో ఆకాశంలో ఎగురుతున్న విమానాలను కూల్చేసే సామర్థ్యాన్ని కనిపెట్టింది. ఇకపై భూమిపై వుంటూనే లేజర్‌ కిరణాలతో శత్రు విమానాలను తుత్తునియుల్ని చేయవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం. దీనికి ఇజ్రాయిల్‌ ‘ఐరన్‌ బీమ్‌’గా నామకరణం చేసింది. ఈ సరికొత్త ఆయుధ వ్యవస్థను ఇజ్రాయిల్‌ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది.

ఐరన్‌ బీమ్‌ అంటే ఏమిటి?

ఇదొక అధునాతన సాంకేతిక వ్యవస్థ. పూర్తిగా లేజర్‌ వ్యవస్థతో నిర్మితమైంది. వైరిదేశాలు ప్రయోగించే రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లు (సీ-రావ్న్‌), విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను పసిగట్టి వాటిని గాల్లోనే ధ్వంసంచేసేదే ‘ఐరన్‌ బీమ్‌’. గాజాలోని హమాస్‌ ఉగ్రవాదులు గత ఏడాది చేసిన రాకెట్‌ దాడులను తిప్పికొట్టడానికి గతంలో ఇజ్రాయిల్‌ ‘ఐరన్‌డోమ్‌’ను వాడింది. హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై 1,200 వరకు రాకెట్లను ప్రయోగించారు. వీటిలో 200 రాకెట్లను డోమ్‌ ధ్వంసం చేసింది. దీని కోసం రూ. 235 కోట్లు ఖర్చు చేసింది. మిగతా వెయ్యి రాకెట్లను నిర్వీర్యం చేయలేకపోయింది. దీంతో ఇజ్రాయెల్‌కు భారీ నష్టం సంభవించింది. ఈ క్రమంలోనే.. రాకెట్లను, డ్రోన్‌లను నాశనం చేయడమే లక్ష్యంగా ఈ ‘ఐరన్‌ బీమ్‌’ను తీసుకొచ్చారు. లేజర్‌ కిరణాల సాయంతో ఇది పనిచేస్తుంది. ‘ఐరన్‌డోమ్‌’తో ఒక్క రాకెట్‌ను పేల్చడానికి ఇప్పటివరకూ ఇజ్రాయిల్‌కు రూ. కోటి కంటే ఎక్కువ ఖర్చయ్యేది. ‘ఐరన్‌ బీమ్‌’తో 3.5 డాలర్లతోనే (రూ. 267) ఒక్కో లక్ష్యాన్ని కూల్చేయవచ్చు. ఇంత తక్కువ వ్యయంతో కూడిన వ్యవస్థ ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా లేదు. శత్రువుల విమానాన్ని పూర్తిగా, పాక్షికంగా నాశనం చేసే సామర్థ్యం దీని సొంతం. దీని కోసం లేజర్‌ కిరణాల తీవ్రతను మార్చుకొనే వెసులుబాటు ఉంది. అలాగే విమానంలోని నిర్ణీత భాగాన్ని మాత్రమే కూల్చే ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ లేజర్‌ వ్యవస్థ ద్వారా అమెరికా సామ్రాజ్యవాదాన్ని మరింత విస్తృతం చేయడానికి వ్యూహరచన చేయవచ్చని ఇజ్రాయిల్‌ భావించి వుండవచ్చు. ఇప్పటికే అమెరికాకు ఇజ్రాయిల్‌ మధ్యఆసియాలో ఒక తొత్తుగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆయుధ సంపత్తితో మధ్యఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు మరింత ప్రమాదం పొంచివుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (Story: లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!)

See Also: 

నలుగురు పిల్లల్ని కనాల్సిందే!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

మారణాయుధాలతో రౌడీలు హల్‌చల్‌ : 63 మంది అరెస్ట్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1