Home టాప్‌స్టోరీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!

మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!

0
KCR in Press Meet at Pragathi Bhavan
KCR in Press Meet at Pragathi Bhavan

మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది.

 • కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పండిన యాసంగి పంటను సేకరించకుండా సంకుచితంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల నిరసన. రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని నిర్ణయం. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుంది. యాసంగి వడ్లను కొనేందుకు చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు.
 • ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, ఇతర గెజిటెట్‌ పోస్టుల నియామకాల్లో పాదర్శకత కోసం ఇక నుంచి కేవలం లిఖిత పరీక్షనే ప్రమాణంగా తీసుకోవాలనీ, ఇంటర్వ్యూ అవసరం లేదనే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌.
 • పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలింపు.
 • విశ్వవిద్యాలయాల్లో 3,500 పై చిలుకు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నియామకానికి ఆమోదముద్ర. ఇకపై విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాలు ఒకే ఒక నియామక సంస్థ (కామన్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌) ద్వారా జరపాలని నిర్ణయం.
 • రాష్ట్రంలో మరో 5 కొత్త ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం. కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం, సివిల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ, ఫార్మా యూనివర్సిటీల స్థాపన.
 • విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటును కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఇతర నగరాలకు విస్తరింపచేయాలని నిర్ణయం. వరంగల్‌, మహబూబ్‌ నగర్‌, నల్గొండ జిల్లాల్లో నూతన ఉన్నత విద్యాసంస్థల స్థాపనకు ప్రోత్సాహం. మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్లను డైరక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, అడిషనల్‌ డైరక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌గా నియామకం.
 • ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సారపాక, భద్రాచలం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
 • చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించే, ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’ ఆమోదం. ఇందుకోసం రూ.1658 కోట్లు మంజూరు.
 • హైదరాబాద్‌ నలుమూలలా సమానస్థాయిలో ఐటి తదితర పరిశ్రమల స్థాపన.
 • జీవో నెంబర్‌ 111 ఎత్తివేతకు ఆమోదం. తద్వారా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం. అభివృద్ధి విస్తరణకు ఈ జీవో ఆటంకంగా మారినందున దాన్ని రద్దు చేయాలని నిర్ణయం.
 • వచ్చే మే నెల 20 నుండి 5 జూన్‌ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయం. (Story: మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!)
 • See Also: 

  ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

  బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?

  మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

  పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

  చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

  రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

  స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

  ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

  ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

  ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

  రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

  వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

  రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

  మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version