Home వార్తలు జాతీయం మోదీకి కేసీఆర్‌ 24 గంటల డెడ్‌లైన్‌!

మోదీకి కేసీఆర్‌ 24 గంటల డెడ్‌లైన్‌!

0
Telangana CM KCR
Telangana CM KCR

మోదీకి కేసీఆర్‌ 24 గంటల డెడ్‌లైన్‌!

దేశంలో భూకంపం సృష్టిస్తాం : దిల్లీ దీక్షలో కేసీఆర్‌

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజులు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించారు. కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్‌ విధించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే తెలంగాణ సత్తా ఏమిటో చూపిస్తామని ప్రకటించారు. ‘‘దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారు. మోదీ, పీయూష్‌ గోయల్‌కు రెండు చేతులు జోడిరచి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనాలని కోరుతున్నా. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? నరేంద్ర మోదీ… నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. కానీ రైతుల వద్ద మాత్రం పెట్టుకోవద్దు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. కేంద్రం ధాన్యం కొనాలని ఢల్లీిలో దీక్ష చేస్తున్నాం. దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన రాకేశ్‌ తికాయత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చింది. రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చాం. రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం. ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. సాగుకు సరిపడా నీటిని అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లో విద్యుత్‌ కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి’ అని కేసీఆర్‌ అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ‘‘దేశంలో భూకంపం సృష్టిస్తాం. పీయూష్‌ గోయల్‌ పరుగులు తీయాల్సిందే. హిట్లర్‌, నెపోలియన్‌ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం? పీయూష్‌ గోయల్‌ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. ఆయనకు రైతులపై ఏమైనా అవగాహన ఉందా? పీయూష్‌ గోయల్‌ మీరు ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడుగలుగుతున్నారు. మా రైతులను, మంత్రులను అవహేళన చేశారు. కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరమైనవి. పీయూష్‌ గోయల్‌ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారు. మేమేమైనా గోయల్‌ వద్ద అడుక్కోవడానికి వచ్చామా? పీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌ మాల్‌! దేశ వ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయి. మోటార్‌, విద్యుత్‌ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేశాం. రైతు ఏడ్చిన రాజ్యం ఏది బాగుపడలేదు. ధాన్యం సేకరణకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్‌ చేస్తున్నాం’’ అని అన్నారు. (Story: మోదీకి కేసీఆర్‌ 24 గంటల డెడ్‌లైన్‌!)

See Also: 

కీలక శాఖలు ఆ నలుగురుకే!

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం హైలైట్స్‌!

బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?

వైసీపీలో అసమ్మతి సెగల దారెటు?

కీలక జిల్లాలకు మొండిచెయ్యి!

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు వీరే! (Full Details)

మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగ‌పూరిత వ్యాఖ్య‌లు

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version