UA-35385725-1 UA-35385725-1

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు వీరే! (Full Details)

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు వీరే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గం ఎట్టకేలకు ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. క్యాబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్‌టీఆర్‌, అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. మిగతా అన్ని జిల్లాల నుంచి సభ్యులకు చోటు దక్కింది. ఎక్కువగా చిత్తూరుజిల్లా నుంచి ముగ్గురిని జగన్‌ తన జట్టులోకి తీసుకున్నారు. తొలి జాబితాలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన తిప్పేస్వామికి చోటు దక్కింది. అయితే అనూహ్యంగా ఆఖరి నిమిషంలో అతన్ని తప్పించి, ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌కు స్థానమిచ్చారు. పాత మంత్రివర్గం నుంచి 11 మందిని కొనసాగించారు. కొత్తగా 14 మందికి చోటు కల్పించారు. 68 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. నూతన కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులుండగా.. సీనియారిటీ పరంగా 11 మంది మంత్రులను కొనసాగించారు. కొత్తగా మరో 14 మందికి అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే.. బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు. (Story: ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు వీరే! (Full Details))

ఏపీ క్యాబినెట్‌ తుది జాబితా ఇదే

శ్రీకాకుళం జిల్లా
1. ధర్మాన ప్రసాదరావు (వెలమ-బీసీ) (శ్రీకాకుళం నియోజకవర్గం)
2. సీదిరి అప్పలరాజు (మత్స్యకార-బీసీ) (పలాస నియోజకవర్గం)
విజయనగరం జిల్లా
3. బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు-బీసీ) (చీపురుపల్లి)
పార్వతీపురం మన్యం జిల్లా
4. పీడిక రాజన్నదొర (జాతాపు`ఎస్‌టి) (సాలూరు నియోజకవర్గం)
అనకాపల్లి జిల్లా
5. గుడివాడ అమర్‌నాథ్‌ (కాపు-ఓసీ) (అనకాపల్లి నియోజకవర్గం)
6. బూడి ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ-బీసీ) (మాడుగుల నియోజకవర్గం)
కాకినాడ జిల్లా
7. దాడిశెట్టి రాజా (కాపు-ఓసీ) (తుని నియోజకవర్గం)
కోనసీమ జిల్లా
8. పినిపె విశ్వరూప్‌ (మాల-ఎస్‌సి) (అమలాపురం నియోజకవర్గం)
9. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసీ-శెట్టి బలిజ)(రామచంద్రాపురం నియోజకవర్గం)
తూర్పు గోదావరి జిల్లా
10. తానేటి వనిత (మాదిగ-ఎస్‌సి) (గోపాలపురం నియోజకవర్గం)
పశ్చిమ గోదావరి జిల్లా
11. కారుమూరి నాగేశ్వరరావు (బీసీ-యాదవ) (తణుకు నియోజకవర్గం)
12. కొట్టు సత్యనారాయణ (కాపు) (తాడేపల్లి గూడెం నియోజకవర్గం)
కృష్ణా జిల్లా
13. జోగి రమేష్‌ (బీసీ-గౌడ) (పెడన నియోజకవర్గం)
పల్నాడు జిల్లా
14. అంబటి రాంబాబు (కాపు) (సత్తెనపల్లి నియోజకవర్గం)
బాపట్ల జిల్లా
15. మేరుగ నాగార్జున (మాల-ఎస్‌సి) (వేమూరు నియోజకవర్గం)
గుంటూరు జిల్లా
16. విడదల రజిని (ముదిరాజ్‌-బీసీ) (చిలకలూరిపేట నియోజకవర్గం)
ప్రకాశం జిల్లా
17. ఆదిమూలపు సురేష్‌ (ఎస్‌సి) (ఎర్రగొండపాలెం నియోజకవర్గం)
నెల్లూరు జిల్లా
18. కాకాణి గోవర్ధన్‌రెడ్డి (ఓసీ-రెడ్డి) (సర్వేపల్లి నియోజకవర్గం)
వైఎస్‌ఆర్‌ కడప జిల్లా
19. అంజాద్‌ బాషా (మైనారిటీ) (కడప నియోజకవర్గం)
నంద్యాల జిల్లా
20. బుగ్గర రాజేంద్రనాథ్‌రెడ్డి (ఓసీ-రెడ్డి) (డోన్‌ నియోజకవర్గం)
కర్నూలు జిల్లా
21. గుమ్మనూరు జయరాం (బీసీ-బోయ) (ఆలూరు నియోజకవర్గం)
చిత్తూరు జిల్లా
22. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ-రెడ్డి) (పుంగనూరు నియోజకవర్గం)
23. నారాయణస్వామి (మాల-ఎస్‌సి) (గంగాధర నెల్లూరు నియోజకవర్గం)
24. ఆర్‌.కే. రోజా (ఓసీ-రెడ్డి) (నగరి నియోజకవర్గం)
అనంతపురం జిల్లా
25. ఉషశ్రీ చరణ్‌ (బీసీ-కురుబ) (కళ్యాణదుర్గం నియోజకవర్గం)

చీఫ్‌ విప్‌గా ప్రసాదరాజు
డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి
ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణు

See Also: మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగ‌పూరిత వ్యాఖ్య‌లు

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1