Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 73 రెవెన్యూ డివిజన్లు ఇవే (ఫైనల్‌)

రాష్ట్రంలో 73 రెవెన్యూ డివిజన్లు ఇవే (ఫైనల్‌)

0
New AP Map
New AP Map

రాష్ట్రంలో 73 రెవెన్యూ డివిజన్లు ఇవే (ఫైనల్‌)

అమరావతి: 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ 26 జిల్లాలు (AP New Districts)గా రూపాంతరం చెందబోతున్నది. కొత్తగా 13 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ఈనెల 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ఆరంభమవుతున్నది. నేడోరేపో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. కొత్తగా 21 కొత్త రెవెన్యూ డివిజన్లు రాష్ట్రంలో ఏర్పడనున్నాయి. సగటున 6 నుంచి 12 మండలాలతో ఒక్కో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో 2 నుంచి 4 రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతున్నాయి. 13 జిల్లాల్లో 3 రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతుండగా, 9 జిల్లాల్లో 2, నాలుగు జిల్లాల్లో నాలుగేసి చొప్పున రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే 51 రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా ఏర్పడే 22తో కలిపి 73 రెవెన్యూ డివిజన్లు అవుతాయి. 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాల నోటిఫికేషన్‌ కొన్ని గంటల్లో వస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ ఆ 73 రెవెన్యూ డివిజన్లు ఏంటో జిల్లాల వారీగా తెలుసుకుందాం.

1. శ్రీకాకుళం : 1. శ్రీకాకుళం, 2. టెక్కలి, 3. పలాస (కొత్తది).
2. విజయనగరం : 4. విజయనగరం, 5. బొబ్బిలి (కొత్తది), 6. చీపురుపల్లి (కొత్తది)
3. పార్వతీపురం మన్యం : 7. పార్వతీపురం, 8. పాలకొండ.
4. అల్లూరి సీతారామరాజు : 9. పాడేరు, 10. రంపచోడవరం
5. విశాఖపట్నం : 11. విశాఖపట్నం, 12. భీమునిపట్నం (కొత్తది)
6. అనకాపల్లి : 13. అనకాపల్లి, 14. నర్సీపట్నం
7. కాకినాడ : 15. కాకినాడ, 16. పెద్దాపురం
8. కోనసీమ : 17. రామచంద్రాపురం, 18. అమలాపురం, 19. కొత్తపేట (కొత్తది)
9. తూర్పు గోదావరి : 20. రాజమహేంద్రవరం, 21. కొవ్వూరు
10. పశ్చిమ గోదావరి : 22. నర్సాపురం, 23. భీమవరం (కొత్తది)
11. ఏలూరు : 24. ఏలూరు, 25. జంగారెడ్డిగూడెం, 26. నూజివీడు
12. కృష్ణా : 27. మచిలీపట్నం, 28. గుడివాడ, 29. ఉయ్యూరు (కొత్తది)
13. ఎన్టీఆర్‌ : 30. విజయవాడ, 31. తిరువూరు (కొత్తది), 32. నందిగామ (కొత్తది)
14. గుంటూరు : 33. గుంటూరు, 34. తెనాలి
15. బాపట్ల : 35. బాపట్ల (కొత్తది), 36. చీరాల (కొత్తది)
16. పల్నాడు : 37. గురజాల, 38. నర్సరావుపేట, 39. సత్తెనపల్లి (కొత్తది)
17. ప్రకాశం : 40. మార్కాపురం, 41. ఒంగోలు, 42. కనిగిరి (కొత్తది)
18. నెల్లూరు : 43. నెల్లూరు, 44. కందుకూరు, 45. కావలి, 46. ఆత్మకూరు
19. కర్నూలు : 47. కర్నూలు, 48. ఆదోని, 49. పత్తికొండ
20. నంద్యాల : 50. నంద్యాల, 51. డోన్‌ (కొత్తది), 52. ఆత్మకూరు (కొత్తది)
21. అనంతపురం : 53. అనంతపురం, 54. కళ్యాణదుర్గం, 55. గుంతకల్లు (కొత్తది)
22. శ్రీ సత్యసాయి : 56. ధర్మవరం, 57. పెనుకొండ, 58. కదిరి, 59. పుట్టపర్తి (కొత్తది)
23. వైఎస్‌ఆర్‌ : 60. కడప, 61. బద్వేల్‌, 62. జమ్మలమడుగు
24. అన్నమయ్య : 63. రాయచోటి (కొత్తది), 64. రాజంపేట, 65. మదనపల్లె
25. చిత్తూరు : 66. చిత్తూరు, 67. నగరి (కొత్తది), 68. పలమనేరు (కొత్తది), 69. కుప్పం (కొత్తది)
26. తిరుపతి : 70. తిరుపతి, 71. గూడూరు, 72. సూళ్లూరుపేట, 73. శ్రీకాళహస్తి (కొత్తది) (Story: రాష్ట్రంలో 73 రెవెన్యూ డివిజన్లు ఇవే (ఫైనల్‌)

See Also: ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?

మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version