Home టాప్‌స్టోరీ డ్రగ్స్‌: పంజాబ్‌ టూ హైదరాబాద్‌!

డ్రగ్స్‌: పంజాబ్‌ టూ హైదరాబాద్‌!

0
Drugs
Drugs

డ్రగ్స్‌: పంజాబ్‌ టూ హైదరాబాద్‌!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ రాజ్యమేలుతున్నాయి. డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు నగరంలో అనేక ముఠాలు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల డ్రగ్స్‌ సేవించి ఒక విద్యార్థి మృతి చెందిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా జూనియర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌, ఇతర కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. పంజాబ్‌ నుంచి పెద్దమొత్తంలో హైదరాబాద్‌కు అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లు పోలీసులు తేల్చిచెప్పారు. శుక్రవారంనాడుపంజాబ్‌ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఇద్దరిని హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 900 గ్రాముల నిషిద్ధ మాదక ద్రవ్యాలు, రూ.1,44,800, కారు, మూడు సెల్‌ఫోన్లతోపాటు వేయింట్‌ మిషన్లు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడిరచారు. పంజాబ్‌కు చెందిన జె.సింగ్‌, జమిల్‌ సింగ్‌, రంజిత్‌ సింగ్‌(పరారీలోవున్నాడు) స్నేహితులు. లారీ డ్రైవర్లు పనిచేసిన వీరు సంపాదిస్తున్న దాంట్లో సంతృప్తి లేకపోవడంతో ఉపాధికోసం 12ఏండ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. మేడ్చల్‌లో నివాసముంటూ కండ్లకోయలో ‘పంజాబ్‌ డాబాను’ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు చెందిన లారీ డ్రైవర్లతోపాటు ఇతరులతో పరిచయాలు ఏర్పడ్డాయి. సులువుగా డబ్బులు సంపాదించేందుకు నాలుగు నెలల కిందట డ్రగ్స్‌ను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్‌ నుంచి తక్కువ ధరకు డ్రగ్స్‌ను డ్రైవర్లతో తెప్పించుకుని ఇక్కడ తెలిసిన వారికి, కావాల్సిన వారికి సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ప్రత్యేక నిఘా వేశారు. డీసీపీల ఆదేశాలతో విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారీలోవున్న రంజిత్‌ సింగ్‌ కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు. డ్రగ్స్‌ ముఠాను అరెస్టు చేయడంతో పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలావుండగా, కాలేజీల వద్ద గట్టిగా నిఘా పెట్టాల్సిన అవసరం వుందని పోలీసులు భావిస్తున్నారు. (Story: డ్రగ్స్‌: పంజాబ్‌ టూ హైదరాబాద్‌!)

See Also: జనం తిరుగుబాటు: శ్రీలంకలో ఎమర్జెన్సీ

ఐఏఎస్‌లకు జైలుశిక్ష ఎలా వుందంటే!

మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?

మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version