UA-35385725-1 UA-35385725-1

మాకొద్దీ మంత్రిగిరీ!

మాకొద్దీ మంత్రిగిరీ!

ఏపీలో మంత్రిపదవులపై ఎమ్మెల్యేల నిరాసక్తి
ఇప్పుడున్న మంత్రులు ఏంపొడిశారని నిలదీత
నియోజకవర్గాల్లో ప్రజలే దుమ్మెత్తిపోస్తున్నారంటూ ఆరోపణ

అమరావతి: ఏ రాజకీయ నాయకుడైనా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు. ఎమ్మెల్యే అయ్యాక మంత్రిపదవి దక్కాలని ఆశిస్తాడు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో 70 శాతం మంది మంత్రి పదవి కావాలని కోరుకోవడం లేదంటే ఆశ్చర్యంగా లేదూ? కానీ ఇది నిజం! ముమ్మాటికీ నిజం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, ప్రస్తుత ఏపీలో గానీ ఇటువంటి పరిస్థితి తలెత్తడం ఇదే మొదటిసారి. ఎవడిక్కావాలి? ఈ మంత్రిపదవి? అని చాలామంది శాసనసభ్యులు నిరాసక్తి ప్రదర్శిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ పరిస్థితిని విశ్లేషిస్తే, ప్రధానంగా కింది కారణాలు కన్పిస్తున్నాయి.
1. ఒకప్పుడు మంత్రులంటే ఎవరి శాఖలు వారికి ఉండటంతోపాటు ఆ శాఖలపై పట్టు వారికి ఉండేది. అలా అని ఇప్పుడున్న మంత్రులకు వారి శాఖలపై పట్టులేకకాదు. కానీ వారికి నిర్ణయాధికారాలు లేవు. ఏ శాఖలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది ముఖ్యమంత్రి ఆదుపాజ్ఞల ద్వారా మాత్రమే జరుగుతుంది. పైగా అన్ని శాఖల ఫైల్స్‌పై పూర్తి నిర్ణయాధికారం ముఖ్యమంత్రిదే. నామ్‌కే వాస్తేగా మంత్రి ఒక సంతకం పెట్టడం మాత్రమే చేయాల్సివుంటుంది. అంతకుమించి ఏమీ చేయడానికి లేదు. తన శాఖ పరిధిలో కొత్తగా ఎలాంటి గ్రాంట్లు ఇవ్వాలన్నా… లైసెన్సులు లేదా అనుమతులు ఇవ్వాలన్నా… అది సీఎం పేషీ నుంచి అనుమతి రావాల్సిందే. పోనీ ఫలానా విషయంపై సీఎంను సంప్రదించి, నిర్ణయం తీసుకుందామంటే కుదరదు. ఎందుకంటే, మంత్రులు, ముఖ్యమంత్రి కలిసేది కేవలం మంత్రివర్గ సమావేశంలో మాత్రమే. అంతకుమించి, వారు కలుసుకునేది చాలా తక్కువ. మంత్రులకు సీఎం సమయం ఇచ్చేదంటూ ఏమీ వుండదు. బహుశా ఆంధ్రా చరిత్రలోనే ఈ తరహా పరిస్థితి తొలిసారి నెలకొన్నది. ఇక ఎమ్మెల్యేలు సీఎంను చూసి చాన్నాళ్లయింది.
2. మంత్రులకు తమ ప్రమేయం లేకుండానే తన శాఖకు సంబంధించిన ఫైళ్లు వాటంతట అవే కదిలిపోతుంటాయి. అధికారులపై మంత్రులకు ఇదివరకు పెత్తనం వుండేది. ఇప్పుడు అధికారులు కూడా మంత్రులను పెద్దగా పట్టించుకోరు. మంత్రి ఏదైనా అడిగితే, సీఎంని అడిగి చేయడం ఉత్తమమని వారు తిరిగి సలహా ఇస్తుంటారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు కూడా మంత్రులపై పెద్దగా గౌరవం ఏమీ లేదు. వారి ఆదేశాలనూ పట్టించుకున్న పాపాన పోలేదు.
3. శాఖల అధికారిక కార్యక్రమాల రూపకల్పన అధికారుల ఆధ్వర్యంలో జరిగేది. అనంతరం మంత్రి ఆమోదముద్ర వేసిన తర్వాత సీఎం వద్దకు ఫైల్‌ వెళ్లేది. సీఎం ఓకే చేసిన తర్వాత ప్రోటోకాల్‌ ప్రకారం కార్యక్రమాలు జరిగిపోయేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సీఎం అన్నీ ఓకే చేసిన తర్వాతనే మంత్రి తలూపాల్సి వుంటుంది.
4. పోలీసు కార్యాలయాలు, రెవిన్యూ, రవాణా, ఇతర పాలనా కార్యాలయాల్లో మంత్రుల ఫోన్‌కాల్స్‌కు అధికారులు భయపడేవారు. ఇప్పుడలా లేదు. సీఎం పేషీ నుంచి వచ్చే కాల్స్‌ తప్ప పెద్దగా పట్టించుకునే వారే లేరు. అలాగని పెద్ద ప్రభావం లేకపోయినా, కొంతమేరకు మంత్రులకు గౌరవం దక్కుతుంది.
5. ఎన్నడూ లేని విధంగా సీఎం సలహాదారులు, ప్రత్యేక సలహాదారుల పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది. రోజువారీ ప్రెస్‌మీట్‌లను కూడా సలహాదారులే నిర్వహిస్తుంటారు. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టేది వారే. అరకొరగా కొద్దిమంది మంత్రులు మాత్రమే తమ బాధ్యతగా ప్రభుత్వం పక్షాన మాట్లాడి, సీఎం సలహాదారులు పంపించిన నోట్‌ ఆధారంగా మాట్లాడుతుంటారు.
6. శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కొత్త అంశాలను బయటపెట్టడానికి, లేదా వెల్లడిరచడానికి మంత్రులకు ఎలాంటి అధికారం లేదు. అవి ముఖ్యమంత్రి వెల్లడిరచాలి. లేదా మంత్రివర్గ సమావేశానంతరం ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి చెప్పాల్సి వుంటుంది. ఇప్పటివరకు ఫలానా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మాత్రమే మంత్రులు చెప్పాలి. అంతకుమించి వారికి ఎలాంటి ‘పవర్‌’ లేదు.
7. వివిధ శాఖలకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి గానీ, విదేశాల నుంచి గానీ వచ్చే ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి వెళ్తుంటారు. సంబంధిత శాఖ మంత్రులను కలవాల్సిన పరిస్థితి లేకుండాపోయింది. బహుశా అవసరం లేకపోయి వుండవచ్చు.
8. ముఖ్యమంత్రి తన పాలనకు అవసరమైన మేరకు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వారు అంతవరకే పనిచేయాల్సి వుంటుంది. ఉదాహరణకు, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌రెడ్డి అప్పుల కోసం ఢల్లీి గల్లీల్లో తిరుగుతుంటారు. రుణాల అన్వేషణ అతని పని. ఆయనకు సీఎం అప్పగించిన పని అదే. అంతకుమించి ఆయన తన పరిధిని దాటరాదు. తెలంగాణలో కేటీఆర్‌ విదేశాలకు వెళ్లి రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సఫలమయ్యారు. కానీ అలాంటి పనులు చేయడానికి మంత్రులకు ఆ తరహా పదోన్నతులంటూ ఏమీ ఏపీలో వుండవు.
9. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నీ తానై పనిచేస్తుంటారు. ఆయనే సర్వాంతర్యామి. అది గొప్ప విషయమే. తప్పేమీ కాదు. కాకపోతే మంత్రులు జీర్ణించుకోలేరు. ఎవరి శాఖను వారికి వదిలేస్తే తమ పరిధిలో మంత్రులు విపరీతమైన అక్రమార్జన చేసేవారు. కానీ ఆ అవకాశాన్ని సీఎం ఇవ్వడం లేదు. మంత్రుల స్థాయిలో అవినీతి తక్కువగా వుండటానికి కారణం అదే. ఏ పని జరగాలన్నా సీఎం పరిధిలో వుండటమే అందుకు ప్రధాన కారణం. మంత్రులంతా డమ్మీలయ్యారు.
10. ఇప్పుడున్న మంత్రులు తమ నియోజకవర్గాలకు గానీ, లేదా రాష్ట్ర ప్రజలకు గానీ ఏం పొడిశారని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లో సైతం వారికి ఆదరణ తగ్గిపోయిందని, సొంత నియోజకవర్గ ప్రజలే వారిపై దుమ్మెత్తిపోస్తున్నారని, అందువల్ల కొత్తగా తాము మంత్రులమైతే లాభపడేది ఏమీ లేదని మెజారిటీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
పైన పేర్కొన్న కారణాల వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న చాలామంది మంత్రులు తమ పదవులను వదులుకోవడానికి పూర్తిగా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మంత్రిగిరీ చేపట్టడానికి చాలామంది ఎమ్మెల్యేలు ముందుకు రావడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం మంత్రిపదవులను ఆశిస్తున్నారు. అయితే వారెందుకు పదవి కోరుకుంటున్నారంటే, హోదా, హుందాతనం కోసం మాత్రమే. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మాజీమంత్రి తనకు కొత్తగా మంత్రిపదవి ఆశిస్తున్నారు. దాని వల్ల ఆయన కొత్తగా ఆర్జించేదేమీ లేదు. కాకపోతే అతను హోదాను కోరుకుంటున్నారు. భవిష్యత్‌లో ఆ జిల్లాలో తన ప్రభావాన్ని తగ్గించుకోకుండా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో వున్న కొందరు సీనియర్‌ మంత్రులు కూడా నిర్ణయాధికారాలు తమకు లేకపోయినా, పదవి వుంటే చాలని భావిస్తున్నారు. ఇంకా విరక్తిభావనకు వారు చేరుకోలేదు. ఏదేమైనప్పటికీ, ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది మంత్రిపదవులపై ఆసక్తి చూపడం లేదన్నది మాత్రం వాస్తవం. వారు చెప్పుకుంటున్న కారణాలేమైనా వుండవచ్చు. కానీ ఓవరాల్‌గా నిరాసక్తి నెలకొన్న మాట నిజం!
– జర్నలిస్టు మధుబాబు
(Note: సెక్రటేరియట్‌లోని అభిజ్ఞవర్గాలు, సన్నిహితమంత్రివర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ కథనం రాయడం జరిగింది. ఎవరినీ తక్కువ చేయడం, లేదా ఎక్కువ చేయడం అనేది మా ఉద్దేశం కాదు. ఇందులో అభిప్రాయాలు రచయితకు సంబంధించినవి. వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు) (Story: మాకొద్దీ మంత్రిగిరీ!)

See Also: ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1