Home వార్తలు ప్రపంచం చైనాలో లాక్‌డౌన్‌!

చైనాలో లాక్‌డౌన్‌!

0
Corona in China
Corona in China

చైనాలో లాక్‌డౌన్‌!

బీజింగ్‌: కరోనా జన్మస్థలమైన చైనాను అదే మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. తాజాగా చైనాలో ఊహకు అందనివిధంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఫలితంగా చైనా ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన విధించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూనే, ఇంకొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా చైనాలో వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో 2.6 కోట్ల మంది ప్రజలు ఆంక్షల్లోకి వెళ్లారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని కార్యాలయాలు, ప్రజా రవాణాను నిలిపివేసింది. ప్రజలకు పెద్ద ఎత్తున పరీక్షలు చేపడుతోంది. చైనాలో బీఏ 2 వేరియంట్‌ వల్లే కేసులు పెరుగుతున్నాయని చైనా ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. ఒమిక్రాన్‌ కన్నా వేగంగా బీఏ2 వ్యాప్తి చెందుతోంది. మార్చి నెలలో రికార్డ్‌ స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా 56000 కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా ఈశాన్య ప్రావిన్స్‌ అయిన జిలిన్‌లో వ్యాప్తి ఎక్కువగా ఉంది. గతంలో కరోనా కారణంగా టెక్‌ సిటీ షెన్‌జెన్‌లో కూడా లాక్‌డౌన్‌ విధించారు. కొత్తగా ఈ దేశంలో 6,215 కొత్త కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. చైనాలో శుక్రవారం 4,790, శనివారం 5,600 కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ 19 పుట్టింది చైనాలోనే. ఆ తర్వాత అది ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. కాకపోతే చైనాలో చాలా వేగంగా కరోనాను అదుపు చేయగలిగారు. అంత జరిగినా భారీగానే ప్రాణనష్టం వాటిల్లింది. మొదట్నించీ జీరో కోవిడ్‌ స్ట్రాటజీని అవలంభిస్తున్న చైనా తాజాగా కరోనా విజృంభించడంతో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించాల్సి వస్తున్నది. (Story: చైనాలో లాక్‌డౌన్‌!)

See Also: రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version