Home టాప్‌స్టోరీ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కొత్త‌ ఐడియా

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కొత్త‌ ఐడియా

0
Prabhas Radhe Shyam
Prabhas Radhe Shyam

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) వినూత్నమైన ఐడియా.. దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కొత్త‌ ఐడియా: రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వినూత్నమైన ఐడియాతో వచ్చారు దర్శక నిర్మాతలు. జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి చాలా హ‌నెస్ట్‌గా ఓ విష‌యాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజ‌న్ అంటున్నారు మేకర్స్. రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్ర‌భాస్ న‌టించారు. ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేసారు. అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. మార్చ్ 11, 2022న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. (Story: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కొత్త‌ ఐడియా)

నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..

టెక్నికల్ టీమ్:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్
సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను

See Also: Pushpa Jumps into Top-15

Bangarraju’ is on a roll clocking

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version