ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్  పరీక్షలకు  ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్ : ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. మార్చి 9 వ తేదీ సోమవారం నుంచి 27 వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1,251 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.

ఇంటర్ పరీక్షలకు 973,237 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొంది. వారిలో 426, 448 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం, 506789 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారని వివరించింది.

టిఆర్‌ఎస్‌కి బలుపుకాదు…వాపు : ఉత్తమ్‌

 ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణలో టిఆర్‌ఎస్‌ది బలం కాదని, వాపు మాత్రమేనని కొత్తగా టిపిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి చాలామంది నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను ఆయన మాటల్లోనే చదవండి…‘‘తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్తకర్యలు, అభిమానులకు సేవలందించడం అదృష్టం. వచ్చే రెండు నెలల్లో పూర్తిగా సంస్థాగత మార్పులపై దృష్టిపెడతాం. అన్ని కమిటీలు వేసి పార్టీని వ్యవస్థాగతంగా బలంగా నిర్మిస్తాం. నల్లగొండలో నాయకుల్లో విభేదాలున్నాయి. అందరినీ కలసి అభిప్రాయాలు తీసుకొని, అందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తాను. గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ 30 ఏళ్ళ తర్వాత పోటీచేస్తున్నాం. ఆ తర్వాత మేం ఏనాడూ అభ్యర్థిని నిలబెట్టలేదు. అధ్యక్షునిగా అవ్వకముందే అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాం. గట్టిపోటీనిస్తాం. పార్టీ నుంచి వలసలు ఆపుతాం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో టిఆర్‌ఎస్‌ ఒక చెడు సాంప్రదాయాన్ని తీసుకువచ్చింది. ఇతర పార్టీల టిక్కెట్లపై గెలిచిన వారికి ప్రలోభాలు పెట్టి, బెదిరించి తమ పార్టీలోకి తీసుకువస్తున్నారు. మీడియా కూడా సరిగా స్పందించడం లేదు. పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలు నచ్చి వారు పార్టీలోకి వెళ్లడం లేదు. స్వలాభం కోసం వారు వలసపోయారు. ఇది పూర్తిగా అనైతికం. అయినప్పటికీ, దాన్ని అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఇలా టిఆర్‌ఎస్‌ వారు ఎవరిని పార్టీలోకి తీసుకున్నా…అది వారి బలం కాదు. అసలు బలం కార్యకర్తల్లో వుంది. పిసిసికి, సిఎల్‌పికి మధ్య ఎలాంటి వివాదం వుండదు. కలిసి పనిచేస్తాం. ప్రతి విషయాన్నీ సిఎల్‌పి నేత కె.జానారెడ్డిని సంప్రదించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం. సమన్వయ లోపాలను తగ్గించి, పార్టీని ముందుకు నడిపించి పూర్వ వైభవాన్ని తీసుకువస్తాం.