3డేళ్ల నుంచి సహజీవనం చేసిన ప్రేయసిని చంపి…

3 డేళ్ల నుంచి సహజీవనం చేసిన ప్రేయసిని చంపి...

3 డేళ్ల నుంచి సహజీవనం చేసిన ప్రేయసిని చంపి…

చెన్నై : 3 డేళ్ల నుంచి సహజీవనం చేసి.. ఉన్నట్టుండి ఏమైందో ఏమోగానీ ఆ ప్రియుడు రాక్షసుడిలా మారి ప్రియురాల్ని కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాకుండా  బెడ్షీట్లో శవాన్ని చుట్టి లోయలోకి విసిరేశాడు.  చెన్నై నగరంలో కలకలం రేపిన ఈ హత్యోదంతం సోమవారం రాత్రి జరిగింది.

ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న దినేశ్ కన్నప్పన్ (25)కు ఎఫ్సీఐ ఉద్యోగిని  అరుణ శ్రీనివాసన్ (22) తో చాలా కాలంగా పరిచయం ఉంది. గత మూడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించిన దినేశ్.. సోమవారం రాత్రి అయనవరంలోని అరుణ ఫ్లాట్ కు వెళ్లాడు.ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో ఉన్మాదిగా మారిన దినేశ్ ఫ్లవర్ వాజ్ తో అరుణ తలపై బలంగా మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ప్రియురాలి శవాన్ని బెడ్షీట్లో చుట్టి కారు డక్కీలో పెడుతుండగా స్థానిక యువకుడొకడు దినేశ్ చర్యను గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. తాను అనుకున్న ప్రాంతానికి చేరుకున్న దినేశ్.. అరుణ మృతదేహాన్ని లోయలోకి నెట్టేశాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు అతడు అక్కడ నుంచి పరారయ్యాడు.