2:08 pm - Sunday August 20, 3302

ఊపేసిన ఊతప్ప

ఊపేసిన ఊతప్ప

ఊపేసిన ఊతప్ప

కోల్‌కత్తా స్కోరు 163/8

కోల్‌కతా: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై బుధవారంనాటి క్వాలిఫయింగ్ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ రాబిన్ ఊతప్ప దూకుడుతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. విజయానికి పంజాబ్ 164 పరుగులు చేయాల్సి ఉంటుంది. రాబిన్ ఊతప్ప 30 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కెప్టెన్ గౌతం గంభీర్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. పాండే 21 పరుగులు చేశాడు. గత మ్యాచులో ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఉతికి ఆరేసిన యూసుఫ్ పఠాన్ 18 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఊతప్ప తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ పంజాబ్ బౌలర్లను పెద్దగా తట్టుకోలేకపోయారు.పంజాబ్ బౌలర్లలో కరన్‌వీర్ సింగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. జాన్సన్, పటేల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

Filed in: National, News, Sports

No comments yet.

Leave a Reply

Protected by WP Anti Spam