నెలకు రూపాయి ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాదబీమా: జైట్లీ

 అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ : దేశంలో చాలామందికి ఎలాంటి ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమా లేదని, చాలా మందికి పింఛను కూడా రావట్లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇందుకోసం త్వరలోనే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. దీనికింద ఏడాదికి 12 రూపాయల ప్రీమియంతో.. అంటే, నెలకు రూపాయి ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. అంటే, ఈ ప్రీమియం కట్టినవాళ్లు ఎవరైనా ప్రమాదాల్లో మరణిస్తే, వాళ్ల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఇస్తారన్నమాట.

ప్రధానమంత్రి జనధన యోజన కింద అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని, అందులో భాగంగా పింఛను సదుపాయం కూడా ఇస్తామన్నారు. ప్రతినెలా ఈ ఖాతాలో పేదలు ఎంత ఆదా చేస్తే అందులో సగం మళ్లీ ప్రభుత్వం కూడా కలుపుతుందని, 60 ఏళ్ల వయసు దాటినప్పటినుంచి వారికి పింఛను వస్తుందని అన్నారు. అలాగే, 18-50 ఏళ్ల మధ్యవారికి ఏడాదికి రూ. 335 ప్రీమియంతో మరో ప్రమాదబీమా కల్పిస్తామన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుచేస్తామని, వృద్ధుల కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

More from My site

  • కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌ (ఫైనల్‌)కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌ (ఫైనల్‌) న్యూదిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో శనివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 11 గంటలకు అరుణ్‌జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగం చేశారు. అరగంట తర్వాత […]
  • ఆదాయ పన్ను యథాతథం: అరుణ్ జైట్లీఆదాయ పన్ను యథాతథం: అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ : ఆదాయపన్ను శ్లాబులలో ఎలాంటి మార్పుచేర్పులు చేయకుండా గత సంవత్సరంలాగే యథాతథంగా అమలు చేస్తున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. దాంతో గత సంవత్సరంలో ఎలాంటి పన్ను శ్లాబులు ఉన్నాయో, […]
  • ‘లక్ష’ దాటితే పాన్కార్డు తప్పనిసరి‘లక్ష’ దాటితే పాన్కార్డు తప్పనిసరి న్యూఢిల్లీ : ఇక నుంచి లక్ష దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్కార్డు తప్పనిసరి కానుంది. నల్లధనాన్ని నియంత్రించటానికి కేంద్రం నడుము బిగించింది. దాంతో పాన్ కార్డు ద్వారానే లావాదేవీలు […]
  • ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సాయంఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సాయం న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన బీహార్, పశ్చిమ బెంగాల్తో  పాటు ఏపీకి కూడా కేంద్రం సాయం చేయనుంది. ఈ మేరకు కేంద్ర […]
  • త్వరలో క్యాష్లెస్ ఇండియా: అరుణ్ జైట్లీత్వరలో క్యాష్లెస్ ఇండియా: అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ :  త్వరలో క్యాష్లెస్ ఇండియాను తయారు చేద్దామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక నుంచి  నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే  జరిపేలా చూద్దామని ఆయన తెలిపారు.  నగదు […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Protected by WP Anti Spam