4:12 am - Thursday November 27, 2014

నాగార్జున్‌-కార్తి ఒకే హీరోయిన్‌తో రొమాన్స్‌!

హైదరాబాద్‌ : తెలుగు స్టార్‌ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్‌ కార్తిల కాంబినేషన్‌లో డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరి ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఈ ఇద్దరు హీరోలు ఒకే హీరోయిన్‌తో రొమాన్స్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం హీరోయిన్‌ కోసం అన్వేషణ సాగుతోంది. ఈ చిత్రాన్ని పివిపి సినిమా తమ అత్యుత్తమ నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. అక్కినేని నాగార్జునకు తెలుగుతో పాటు తమిళ చిత్రసీమలో కూడా మంచి ఇమేజ్‌ ఉంది. అలాగే కార్తి ఇటీవలే ‘మద్రాస్‌’ చిత్రంతో తమిళంలో ఘన విజయం సొంతం చేసుకున్నారు. కార్తికి తెలుగులోను మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ద్వారా తెలుగు-తమిళ ఇండిస్టీలను ఏకం చేసే అద్భుత అవకాశాన్ని పివిపి సొంతం చేసుకోవడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పివిపి సంస్థ తెలిపింది.

Filed in: A-1 Tollywood, Cinema, News, Top Rated

No comments yet.

Leave a Reply

Protected by WP Anti Spam