8:49 am - Tuesday January 27, 2015

ప్రాణాలు మింగిన పిల్లర్‌ గుంత

ప్రాణాలు మింగిన పిల్లర్‌ గుంత

ప్రాణాలు మింగిన పిల్లర్‌ గుంత

హైదరాబాద్‌ : మెట్రోరైల్‌ పిల్లర్‌ గుంతలో సిమెంట్‌ లారీ బోల్తా పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మలక్‌పేట్‌ నల్లగొండ చౌరస్తాలోని మెట్రోరైల్‌ పనులు జరుగుతున్న విషయం తెల్సిందే. గురువారం మెట్రోరైల్‌ పిల్లర్ల కోసం తీసిన గుంతలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుంటూరు దాచేపల్లి నుండి హైదరాబాద్‌కు వస్తున్న మణి సర్కార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిమెంట్‌ లారీ బోల్తా పడింది. 10 మంది కార్మికులు పిల్లర్‌ గుంతలో పనులు చేస్తుండగా అతివేగంగా దూసుకువచ్చిన సిమెంట్‌ లారీ గుంతలో పడింది. అక్కడే పిల్లర్లు దింపుతున్న జార్గండ్‌ పాలెంకు చెందిన ముంతాజ్‌ అన్సారీ (20), బాబులాల్‌ (19) కార్మికులు లారీ కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ కుర్మయ్యకు గాయాలయ్యాయని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Filed in: News, State

No comments yet.

Leave a Reply

Protected by WP Anti Spam